బ్లాక్ బస్టర్ కాదు.. "మన శంకర వరప్రసాద్ గారు" పై అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్.!

Pandrala Sravanthi
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రివ్యూలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే అందరి రివ్యూలు ఏమోగానీ ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ మాత్రం అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు ఫాన్స్ ఇద్దరినీ ఇరకాటంలో పడేసింది. మరి ఇంతకీ అల్లు అర్జున్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఇచ్చిన రివ్యూ ఏంటి..ఎందుకు చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ కాదు అంటూ పోస్ట్ పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను వీక్షించిన అల్లు అర్జున్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. అల్లు అర్జున్ తన ఎక్స్ లో ఈ విధంగా ట్వీట్ చేశారు..మన శంకర వరప్రసాద్ గారు సినిమా యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్.. వింటేజ్ లుక్కులో చిరంజీవి గారు అదరగొట్టేశారు. 


ఇది బ్లాక్ బస్టర్ కాదు బాస్ బస్టర్..ద బాస్ ఈజ్ బ్యాక్.. చిరంజీవి గారి ఏజ్ ఏంటి..ఆయన వేసే స్టెప్పులు ఏంటి.. ఆ హుక్ స్టెప్ చూస్తే మైండ్ బ్లోయింగ్.. తన డ్యాన్స్ తో అభిమానులను, ప్రేక్షకులను అలరించాడు.. అంటూ అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే నయనతార గ్రేషియస్ లుక్ లో అమేజింగ్ గా నటించింది అని, వెంకటేష్ గారు ఉన్నతంగా నటించారని, నిర్మాతలైనటువంటి సాహు గారపాటి,సుస్మిత కొణిదల ఇద్దరు సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేశారని, కేథరిన్ తెరిస్సా తనదైన స్టైల్ లో పంచులతో,యాక్టింగ్ తో ఇరగదీసిందని, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ తో ఆకట్టుకున్నారని, ఇక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిల్ రావిపూడి ఎప్పటిలాగే సంక్రాంతికి వచ్చాడు హిట్ కొట్టాడు ఇది రిపీట్.. అంటూ అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటూ మన శంకర వరప్రసాద్ గారు మూవీ పై ట్వీట్ పెట్టారు.


ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఇద్దరు సంబరపడి పోతున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ రీసెంట్ గానే జపాన్లో విడుదలైన సంగతి తెలిసిందే.జపాన్లో మూవీ విడుదల కావడంతో ఫ్యామిలీతో సహా అల్లు అర్జున్ జపాన్ కి వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేయడంతో పాటు ఫ్యామిలీతో కూడా సరదాగా గడిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: