సినీనటి కరాటే కళ్యాణి పై దాడి.. ఎందుకు? ఏం జరిగిందంటే?
ఆదిభట్ల వండర్లా దగ్గర ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తూ ఉండగా, పంజాగుట్ట పోలీసులతో సహా ఆ ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి పట్టుకున్నట్లు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం ముందు వీడియోలను పోస్ట్ చేస్తూ లక్కీ డ్రా పేరుతో కార్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కూడా చేయిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే హిందూ సంఘాలు కూడా ఫైర్ అయ్యాయి. ఇలాంటి వారి పైన కరాటే కళ్యాణి కేసు నమోదు చేసింది.
ఇలాంటి సమయంలోనే వారిని పట్టుకోవాలని ప్రయత్నం చేయగా కరాటే కళ్యాణి మీదికి ఈ నిందితుల సైతం దూసుకు వచ్చి ఆమె చున్ని లాగి, తోసి వేసినట్టుగా సమాచారం. ఆ వెంటనే అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కరాటే కళ్యాణితో పాటుగా ఆమె కొడుకు పైన జరిగిన దాడి గురించి ఆమె సోషల్ మీడియాలో లైవ్ పెట్టారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లక్కీ డ్రా పేరుతో చాలామంది కార్లు, హౌసింగ్ ఫ్లాట్లు అంటూ ఎక్కువగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.