"మన శంకర వరప్రసాద్ గారు" ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?

Pandrala Sravanthi
మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమా ఇది.. చిరంజీవి హీరోగా.. నయనతార హీరోయిన్ గా.. అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ పోషించారు. ఇక వెంకీ వచ్చిన తర్వాత సినిమా మరింత అద్భుతంగా ఉందని మూవీ చూసిన ప్రేక్షకులు అందరూ రివ్యూ ఇస్తున్నారు.ఇప్పటికే సినిమా మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అని.. సంక్రాంతి విన్నర్ అని అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఎప్పటిలాగే తన మార్క్ కామెడీతో డైరెక్షన్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకువెళ్లారని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. అంతేకాకుండా చాలామంది మెగా అభిమానులకు కూడా సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది.


 ఈ సినిమా ద్వారా వింటేజ్ చిరంజీవిని దర్శకుడు మరోసారి మెగా ఫ్యాన్స్ కి తెరపై చూసే అదృష్టాన్ని కలిగించారని అంటున్నారు. అలాగే ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో తన మార్క్ మ్యూజిక్ ని అందించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారని అంటున్నారు. అయితే అలాంటి ఎన్నో అంచనాల మధ్య జనవరి 12న విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఎన్నో తాజాగా బయటపడింది. మరి ఇంతకీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి వచ్చిన మొదటి రోజు కలెక్షన్లు ఎన్నో ఇప్పుడు చూద్దామా.. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు ఇండియా లో వచ్చిన కలెక్షన్స్ కలిపి 37.10 కోట్ల వసూలు రాబట్టినట్టు Sacnik పేర్కొంది.


 అయితే ఇందులో ప్రీమియర్స్ ద్వారా 8.6 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేయగా.. సోమవారం రోజు 28.50 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలిపింది. అలా మొత్తంగా మొదటి రోజు చిరంజీవి సినిమా హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ టచ్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కథ ఎంతో బాగా నచ్చడంతో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అని అంటున్నారు. అంతేకాకుండా పిల్లలు పెద్దరు అందరూ కలిసి సినిమా సంతోషంగా చూడొచ్చు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. దాంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: