నయనతార ప్రమోషన్స్.. ఆ పదం వాడి కోలీవుడ్లో మంట పెట్టిన అనిల్ రావిపూడి.!

Pandrala Sravanthi
నయనతార ప్రమోషన్స్.. ఈ పేరు వింటుంటేనే ప్రస్తుతం చాలామంది ఆశ్చర్యపోతారు. దానికి కారణం నయనతార సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ ఆ తర్వాత ఆమె ఎంత పెద్ద హీరోతో నైనా సినిమాలో నటించనివ్వండి కానీ ఒక్క సినిమా ప్రమోషన్స్ కి కూడా వచ్చేది కాదు. అలా నయనతార తన సినీ కెరియర్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ప్రమోషన్స్ కి, సినిమా ఈవెంట్లకు మాత్రం వచ్చేది కాదు. ఈ విషయంలో ముందే దర్శకులతో అగ్రిమెంట్ చేసుకునేది. హీరోలతోనే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాల ప్రమోషన్స్ లో కూడా పాల్గొనేది కాదు.అయితే ఈ విషయంలో నయనతార కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా నయనతార తన రూల్స్ బ్రేక్ చేస్తూ మొట్టమొదటిసారి చిరంజీవితో కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రమోషన్స్ చేసింది. అలా సినిమా షూటింగ్లో జాయిన్ అయిన మొదట్లో అనిల్ రావిపూడి తో కలిసి ఓ ప్రమోషన్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా పూర్తయ్యాక కూడా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రమోషన్ చేసింది.


 అలా ఎన్నడూ లేనిది నయనతార మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొనడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. అయితే ఈ విషయంలో కోలీవుడ్ నుండి కొన్ని విమర్శలు కూడా నయనతారను చుట్టుముట్టాయి. అయితే తాజాగా నయనతార పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నయనతార తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోదు. తన పనేదో తాను చేసుకుంటుంది. సినిమా సినిమాకి ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. డైరెక్టర్ హీరోయిన్ దగ్గరికి వెళ్లి కథ చెప్పినప్పుడు మనం వారిని ఎలా ట్రీట్ చేస్తాం అనేదే ముఖ్యం. మన బిహేవియర్ ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. నేను నా షూటింగ్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటాను. అందరితో కలిసిపోయి మాట్లాడుతాను. నా సినిమాలో నటించే చిన్న ఆర్టిస్టులు కూడా నా భుజం మీద ఫ్రెండ్లీగా చేయి వేసి మాట్లాడుతారు.


మనం జెన్యూన్ గా మాట్లాడినప్పుడు వారు కూడా మన కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. మన బాండ్ కోసం ప్రమోషన్స్ చేయని వారు కూడా ప్రమోషన్ చేయడానికి ఒప్పుకుంటారు. నయనతార సినిమా కోసం 100% వర్క్ చేస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. నయనతార ప్రమోషన్స్ విషయంలో ఈ విషయాన్ని బలంగా నమ్ముతుంది. అదేంటంటే..సినిమాకి ఇది చాలా అవసరం. డైరెక్టర్ పని తీరు ఇలా ఉంటుంది అని నమ్మినప్పుడు ఖచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు. అంటూ అనిల్ చెప్పుకొచ్చారు. అయితే అనిల్ రావిపూడి వాడిన బిహేవియర్ అనే ఒకే ఒక్క పదంతో కోలీవుడ్లో పెద్ద మంట పెట్టారు. ఇక అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది కోలీవుడ్ జనాలు అంటే కోలీవుడ్ లో ఉండే డైరెక్టర్లు నయనతారతో సరిగ్గా ప్రవర్తించలేదా.. మీరు మాట్లాడిన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఒక్కరే పద్ధతిగా ప్రవర్తించారు..మిగతా దర్శకులు అందరూ వల్గర్ గా ప్రవర్తించారని అంటున్నారా అంటూ మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: