టాక్సిక్ గ్లింప్స్: డాడ్ ఇస్ హోమ్ డైలాగ్ తో యష్..!

Divya
కేజిఎఫ్ ,కే జి ఎఫ్2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ సంపాదించుకున్న హీరో యష్ తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి మరింత అంచనాలు పెరిగిపోయాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా కియారా అద్వాని, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తారాసుతారియా తోపాటుగా మరి కొంతమంది నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు.


ఈరోజు యష్ పుట్టినరోజు సందర్భంగా హీరో యష్ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఒక గ్లింప్స్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ చూస్తూ ఉంటే హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉండేలా కనిపిస్తోంది. గ్లింప్స్ లో  హీరో యష్ వైల్డ్ రొమాన్స్ తో పాటుగా యాక్షన్ చూపించారు. ఇవన్నీ కూడా మరింత ఎక్సైటింగ్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో కనిపించిన ప్రతి సీన్  హాలీవుడ్ రేంజ్ లో  ఫాన్స్ ను ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా మార్చి 19వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చివరిలో యష్ డాడ్ ఇస్ హోమ్ అంటూ డైలాగ్ చెబుతూ ఫైరింగ్ చేసే సీన్ హైలెట్ గా ఉంది.


యష్ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ గా రాబోతున్న రామాయణం అనే చిత్రంలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేలా డైరెక్టర్ నితీష్ తివారి ప్లాన్ చేశారు. సుమారుగా రూ .800 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా ఇందులో రణబీర్ కపూర్ సాయి పల్లవి వంటి వారు నటిస్తూ ఉన్నారు. రామాయణం చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా కూడా యష్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరి బర్తడే కానుకగా విడుదలైన టాక్సిక్ గ్లింప్స్ వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: