అన్నంత పని చేస్తున్న బన్నీ.. పాన్ ఇండియా హీరోలకి కొత్త టెన్షన్ స్టార్ట్..!?
ఇప్పటికే ఈ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే అని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడని, షూటింగ్ ప్లాన్‌ను రెడీ చేసుకున్నాడని సమాచారం. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న ప్రస్తుత సినిమా ఈ ఏడాది మధ్య నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఆ తర్వాత బన్నీ పూర్తిగా కొత్త లుక్‌లోకి మారి, మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడట. తాజా సమాచారం ప్రకారం… ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి లోకేష్ కనగరాజ్ సినిమాకు షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని వినికిడి. ఈ సినిమా లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘ఇరుంబు కై మాయావి’ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందన్న టాక్ కూడా ఆసక్తిని పెంచుతోంది.
ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు రెడీ అవుతున్నాడని, ఇప్పటివరకు ఎవరూ చూడని లుక్‌లో కనిపించనున్నాడని చెబుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై బన్నీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం బయటకు రాలేదు.ఇంతలోనే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రచ్చ మామూలుగా లేదు. “ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వస్తే ఇక మిగతా పాన్ ఇండియా స్టార్స్‌కి నిద్ర పట్టదు”, “రికార్డ్స్ అన్నీ బద్దలవ్వడం ఖాయం” అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కలయిక ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది.
మరి ఈ భారీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో, బన్నీ కొత్త లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకటి మాత్రం క్లియర్… అల్లు అర్జున్ స్పీడ్ చూస్తుంటే పాన్ ఇండియా రేస్‌లో టెన్షన్ పడేది మిగతా హీరోలే అన్న మాట నిజమయ్యేలా ఉంది!