చిరంజీవి: వేలంలో టికెట్ దక్కించుకున్న అభిమాని..ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!

Divya
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రం జనవరి 12వ తేదీన భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. కామెడీ , ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ట్రైలర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా హీరోయిన్ నయనతార ,చిరంజీవి మధ్య కామెడీ టైమింగ్ కూడా హైలెట్ గా ఉంది. అలాగే విక్టరీ వెంకటేష్ స్పెషల్ గెస్ట్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. దీంతో చిరంజీవి అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.



రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో మొదటి టికెట్ ని మోకా సుబ్బారావు అనే అభిమాని ఏకంగా రూ. 1.11 లక్షలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో ఉండే శ్రీ వెంకటరమణ థియేటర్ వద్ద చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ టికెట్ ను వేలం నిర్వహించగా  చిరంజీవి అభిమాని దక్కించుకున్నారు. ఈ వేలంలో ఎంతో మంది మెగా అభిమానులు పోటీపడినప్పటికీ చివరిగా మోకా సుబ్బారావు అధిక ధరకు దక్కించుకున్నారు. అయితే ఈ నగదును మాత్రం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి అందిస్తామంటూ అభిమాన సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. ఇందుకు సంబంధించి అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.


మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ కూడా లభించింది. ముఖ్యంగా ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు కలదు. ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలకు సంబంధించి పలు ప్రాంతాలలో ఆన్లైన్ బుకింగ్స్  ఓపెన్ చేయగా టికెట్లు సైతం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: