చిరంజీవి పై పనికిమాలిన పరమ చెత్త రూమర్.. సుస్మిత చెప్పుతో కొట్టే ఆన్సర్..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల జీవితం పూర్తిగా ఓపెన్ బుక్‌లా మారిపోయింది. నిజం ఏదైనా సరే, అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేసే వాళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, పెద్ద సినీ కుటుంబాలకు సంబంధించిన విషయాల్లో అయితే రూమర్లకు అసలు కొదవే ఉండదు. ఇందులోనూ మెగా ఫ్యామిలీ అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫేక్ న్యూస్ మరింత ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది.ఇటీవల కాలంలో అలాంటి ఓ పనికిమాలిన రూమర్ మెగాస్టార్ చిరంజీవి పేరు మీద సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది. చిరంజీవికి సర్జరీ జరిగిందని, అందుకే ఆయన బయట కనిపించడం లేదని, సినిమా ప్రమోషన్స్‌కు కూడా దూరంగా ఉన్నారని కొందరు కావాలనే ప్రచారం చేశారు. ఈ రూమర్ చూసి కొంతమంది ఫ్యాన్స్ నిజంగానే టెన్షన్ పడ్డారు. “ఇది నిజమా?” అంటూ షాక్‌కు గురయ్యారు.

ఈ నిరాధారమైన వార్తలకు తాజాగా చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల బలమైన సమాధానం ఇచ్చింది. చిరంజీవి హీరోగా, అనిల్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం సుస్మిత ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్  “చిరంజీవి గారికి సర్జరీ జరిగిందట కదా?” అనే ప్రశ్నను వేసాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే సుస్మిత కొద్దిసేపు సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత అదే రిపోర్టర్ తన ప్రశ్నను కొనసాగిస్తూ,“అందుకే చిరంజీవి గారు సినిమా ప్రమోషన్స్‌కు రావడం లేదని అంటున్నారు కదా?” అని మరోసారి అడిగాడు.

అప్పుడే సుస్మిత చాలా క్లియర్‌గా, ఎలాంటి డౌట్‌కు తావు లేకుండా సమాధానం చెప్పింది. “అలాంటిదేమీ లేదు” అని చెప్పుకొచ్చింది. సుస్మిత మాట్లాడుతూ, “అలాంటి రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదు. చిరంజీవి గారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు” అని స్పష్టం చేసింది. అంతే… ఈ ఒక్క సమాధానంతో సోషల్ మీడియాలో తిరుగుతున్న సర్జరీ రూమర్లకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎలాంటి అగ్రెసివ్ కామెంట్స్ లేకుండా, కానీ చాలా గట్టి విధంగా ఇచ్చిన ఈ ఆన్సర్ మెగా హేటర్స్‌కు చెప్పుతో కొట్టినట్టే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సుస్మిత స్పందన తర్వాత మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లోకి వచ్చారు. “మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ కన్నేసి ఉంచడం మానండి” .. “వాళ్లకూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది”..“ఫేక్ న్యూస్ పంచే ముందు ఒక్కసారి ఆలోచించండి” అంటూ రూమర్స్ సృష్టించే వాళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే, “సుస్మిత చాలా మెచ్యూర్‌గా, గౌరవంగా రూమర్లకు సమాధానం ఇచ్చింది”..“ఇలాంటి ఫేక్ న్యూస్‌కు ఇదే సరైన రిప్లై” అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. చిరంజీవి ఆరోగ్యంపై వస్తున్న అనవసర వార్తల కారణంగా కంగారు పడిన ఫ్యాన్స్‌కు సుస్మిత ఇచ్చిన క్లారిటీ నిజంగా పెద్ద ఊరట కలిగించింది. “చిరంజీవి గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, సినిమాపై పూర్తి ఫోకస్‌తో ఉన్నారు” అనే విషయం బయటకు రావడంతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మొత్తానికి, చిరంజీవిపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఆ పరమ చెత్త రూమర్‌కు సుస్మిత చాలా క్లాస్‌గా, కానీ చాలా స్ట్రాంగ్‌గా ఆన్సర్ ఇచ్చింది. ఇకపై అయినా ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయకుండా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం నేర్చుకోవాలని అభిమానులు కోరుతున్నారు. మెగాస్టార్ అంటే పేరు మాత్రమే కాదు… గౌరవం కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: