హైకోర్టుకు వెళ్లిన ప్రభాస్, చిరంజీవి చిత్ర నిర్మాతలు.. ఏం జరిగిందంటే..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలకు భారీగానే బజ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దీంతో థియేటర్ల కొరత కూడా ఏర్పడుతుందని అభిమానులు భావిస్తున్నప్పటికీ ఇంకా టికెట్ల ధరల పెంపు విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటువంటి సందర్భంలోనే టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి విషయంలో రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.


సంక్రాంతికి ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొందించి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్మాతలు కోరినప్పటికీ కానీ టికెట్ ధరలు పెంచకూడదు, అదనపు షోలకు అనుమతులు ఇవ్వకూడదంటూ సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఆ ఉత్తర్వులను ఇప్పుడు సవాల్ చేస్తూ నిర్మాతలు ఏకంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తరులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలంటూ కోరారు. అలాగే టికెట్ ధరల పెంపు విషయంపై ప్రత్యేక షోల అనుమతి విషయం పైన హోంశాఖ కార్యదర్శి కి దరఖాస్తు చేసుకున్నట్లుగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నిర్మాతలు.


తమ విజ్ఞప్తిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు పిటిషన్లు అత్యవసరంగా విచారించాలంటూ నిర్మాతల తరపున న్యాయవాదులు సైతం హైకోర్టుని అభ్యర్థించారు. కానీ హైకోర్టు మాత్రం నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విచారణ ఈరోజు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనవరి 9వ తేదీన ప్రభాస్ నటించిన రాజాసాబ్, జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారి సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ పిటిషన్ల పైన ఈరోజు విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ విషయంపై హైకోర్టు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఇస్తుందా ?లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: