ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రన్ టైమ్ లాక్.. ఎంతంటే..?

Divya
డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో జనవరి 9వ తేదీన రాబోతున్న చిత్రం రాజా సాబ్. ఇందులో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ,ట్రైలర్ ఈ సినిమా పైన అంచనాలను మరింత పెంచేలా చేశాయి. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. 3 గంటల 9 నిమిషాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.


అలాగే ఈ చిత్రంలోని తల నరికే సన్నివేశాన్ని  మాత్రం సెన్సార్ కట్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా, ఒక్కరోజు ముందుగానే జనవరి 8వ తేదీన రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల  అనుమతుల కోసం చిత్ర బృందం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో ఉదయం 9 గంటల షోకి అనుమతి ఇవ్వాలని కోరగా, టికెట్ ధరల విషయంలో స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను సింగిల్ స్క్రీన్ లో రూ. 800 (జిఎస్టి) , మల్టీప్లెక్స్ లలో రూ 1000(జీఎస్టీ ) పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు.


ఇక జనవరి 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ. 105(జీఎస్టీ), మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 132(జిఎస్టి) , సింగిల్ స్క్రీన్ థియేటర్లకు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రూ. 62(జీఎస్టీ ), మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ. 89 (జీఎస్టీ) పెంచుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరింది చిత్ర బృందం. ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ అధికారులు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇలా ప్రకటన వచ్చిన వెంటనే టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: