ప్రభాస్ విషయంలో సమంత అనుకున్నట్లే జరిగిందిగా.. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్..!

Thota Jaya Madhuri
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉంటారు. కానీ వాళ్లలో కొంతమందే సినిమా స్టోరీ విన్న వెంటనే ఆ సినిమా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అనే విషయాన్ని అంచనా వేయగలుగుతారు. అలాంటి అరుదైన హీరోయిన్స్ లిస్ట్‌లో టాప్ పొజిషన్‌లో ఉండే పేరు సమంత రూత్ ప్రభు. సమంత ఎంత మంచి టాలెంటెడ్ నటీనటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన, డెడికేషన్, పాత్రలో ఒదిగిపోయే విధానం అన్నీ కూడా ఆమెను టాప్ హీరోయిన్‌గా నిలబెట్టాయి. అంతేకాదు, ఆమె ఎంపిక చేసుకునే కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.

సమంత నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ, కథ పరంగా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే సమంత సినిమాలు అనేవి కేవలం కమర్షియల్ కోణంలో కాకుండా కంటెంట్ పరంగానూ గుర్తుండిపోతాయి.ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన ప్రభాస్ విషయానికి వస్తే, ప్రభాస్ – సమంత కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబోపై ఎన్నోసార్లు చర్చ జరిగింది.

అసలు విషయం ఏమిటంటే, కొంతమంది దర్శకులు ప్రభాస్ – సమంత కాంబోలో సినిమా చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్‌లను సమంత స్వయంగా రిజెక్ట్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.అదేంటంటే, ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబెల్’ సినిమా. ఇది ఒక బిగ్ బడ్జెట్ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా చివరకు తమన్నా భాటియా నటించింది. కానీ నిజానికి ఈ పాత్ర కోసం మొదటగా సమంతను సంప్రదించారట. తమన్నా స్థానంలో ముందుగా సమంతనే అనుకున్నారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

కానీ సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. దానికి కారణం సినిమా కథ. కథను పూర్తిగా విన్న తర్వాత, ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేయలేకపోవచ్చని సమంత ముందుగానే అంచనా వేసిందట. అప్పటికే ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న సమంత, స్టోరీ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని సమాచారం.ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు పెద్దగా వెయిట్ లేదని, ప్రేక్షకులపై అంత ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదని సమంత ముందే గెస్ చేసిందట. అందుకే ఎంత బిగ్ హీరో సినిమా అయినా సరే, కథ బలంగా లేకపోతే చేయకూడదని నిర్ణయం తీసుకుందట.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సమంత అనుకున్నట్టే జరిగింది. ‘రెబెల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. అలాగే తమన్నా చేసిన పాత్ర కూడా ప్రేక్షకులపై పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. సినిమా విడుదలైన తర్వాత ఈ విషయం మరింత స్పష్టంగా కనిపించింది.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. “సమంత కథను అంచనా వేసే విషయంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో ఇదే ఉదాహరణ” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే, ప్రభాస్ – సమంత కాంబో ఒక మంచి కథతో ఎప్పుడైనా వస్తే మాత్రం అది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, సమంత స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంత క్లారిటీతో ఉంటుందో, ఎంత ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటుందో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: