వావ్: ప్రభాస్ రూట్ లోనే వెంకీ మావ..ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇది..!
అయితే, అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్న సమయంలో, “నేనున్నాను” అంటూ సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్. అదే వెంకటేష్, సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో వెంకటేష్ మళ్లీ తన స్టామినా ఏంటో నిరూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు వెంకటేష్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న మణిశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యం 3, అలాగే ఆదర్శ కుటుంబం వంటి సినిమాలను కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ వరుస సినిమాలతో వెంకటేష్ మరోసారి తన మార్కెట్‌ను స్ట్రాంగ్‌గా నిలబెట్టుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ తర్వాత ఎవరంటే? అనే చర్చ మొదలైంది. ఈ చర్చలో వెంకటేష్ పేరు బలంగా వినిపిస్తోంది. అభిమానులు ప్రభాస్‌ను ఫాలో అవుతూ, వెంకటేష్ నేటి సీనియర్ జనరేషన్ హీరోలకు మాత్రమే కాకుండా యంగ్ హీరోలకు కూడా ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.స్టార్‌డమ్, కంటెంట్ సెలెక్షన్, ప్రేక్షకుల నమ్మకం—ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న వెంకటేష్, వయసుతో సంబంధం లేకుండా స్టేజ్‌పై ఎవరు ఎప్పుడైనా సత్తా చాటవచ్చని మరోసారి నిరూపిస్తున్నారు. మొత్తానికి, ఒకవైపు ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తుంటే, మరోవైపు వెంకటేష్ తనదైన శైలిలో సాలిడ్ హిట్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.