సామ్ కోసం రాజ్ నిడమోరు బిగ్ శాక్రిఫైజ్..ఏ భర్త చేయకూడని పని..!?

Thota Jaya Madhuri
ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ హీరోయిన్ సమంత ఇటీవలే రెండో వివాహం చేసుకుందనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు రాజ్ నిడమూరు ని  ప్రేమించి సమంత ఆయనను వివాహం చేసుకుంది. డిసెంబర్ 1వ తేదీన ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సమక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారు. చాలా సింపుల్ గా పూర్తిగా గోప్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఈ వివాహం తర్వాత వీరిద్దరి జీవితాలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజ్ నిడమూరు  తీసుకున్న కొన్ని నిర్ణయాలు సమంత అభిమానులను పూర్తిగా ఇంప్రెస్ చేస్తున్నాయి. అయితే అదే సమయంలో రాజ్ నిడమూరు అభిమానుల్లో మాత్రం కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, సమంత మళ్లీ గోల్డ్ రిచ్ కెరీర్‌ను సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సమయంలో, ఆమెకు పూర్తి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో రాజ్ నిడమూరు తన జీవితంలో చాలా పెద్ద త్యాగమే చేయబోతున్నారని టాక్. తనకు ఎంతో ఇష్టమైన డైరెక్షన్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి, పూర్తిగా సమంత సినిమాలు, ఆమె లైఫ్, ఆమె భవిష్యత్‌పై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలిన సమంత, కొన్ని కారణాల వల్ల కెరీర్‌లో బ్రేక్ ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ తన పాత వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే పట్టుదలతో మంచి మంచి సినిమా ఆఫర్స్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సమయంలో ఆమె కెరీర్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసుకునే బాధ్యతను రాజ్ నిడమూరు తన భుజాలపై వేసుకున్నారట. ఆమె సినిమాలు, కథ ఎంపిక, ప్రొఫెషనల్ నిర్ణయాలు మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా కేర్ తీసుకోవాలని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు రాజ్ నిడమూరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనస్పూర్తిగా ప్రశంసిస్తున్నారు. “భార్య కోసం ఇంత త్యాగం చేసే భర్త చాలా అరుదు”, “ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికి దొరకాలి” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే మరోవైపు కొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. “మీకు కూడా ఒక లైఫ్ ఉంది కదా”, “మీ కెరీర్‌ను పూర్తిగా త్యాగం చేయడం అవసరమా?” అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకొంతమంది మాత్రం భార్య గురించి ఆలోచించి తన జీవితాన్ని అంకితం చేయడంలో తప్పేమీ లేదని, అది నిజమైన ప్రేమకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, సమంత – రాజ్  జంటకు సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజమెంత, వదంతులెంత అన్నది పక్కన పెడితే, ఈ కథనం మాత్రం నెటిజన్ల మధ్య భారీ చర్చకు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: