టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ అంటే తెలియని వారు ఉండరు.ఈ హీరోయిన్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాల ద్వారానే ఫేమస్ అయింది. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో పవన్ కళ్యాణ్ పై ఈమె చేసే పరోక్ష కామెంట్లు చాలా రోజుల నుండి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఓ హీరో,డైరెక్టర్ అని పేరు చెప్పకుండా పోస్టులు పెట్టేది మాట్లాడేది.కానీ ఇప్పుడు త్రివిక్రమ్ పేరు డైరెక్టర్ గా చెబుతూ పోస్టులు, కౌంటర్లు ఇస్తుంది.అంతేకాదు త్రివిక్రమ్ దుర్మార్గుడు అంటూ మొహం మీదే చెబుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనకు రాహుల్ గాంధీతో పెళ్లి,పిల్లలు, అబార్షన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి నిజంగానే పూనమ్ కౌర్ కి రాహుల్ గాంధీతో పెళ్లి జరిగిందా.. ఆమె ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఇప్పటికే నా పెళ్లి పై ఎన్నో రూమర్లు వచ్చాయి.
ముఖ్యంగా గతంలో నేను రాహుల్ గాంధీతో కలిసి కనిపించిన సమయంలో రాహుల్ గాంధీ కి నాకు పెళ్లి అంటూ ప్రచారం చేశారు. అంతేకాదు మీడియా నాకు చాలాసార్లు పెళ్లిళ్లు చేయడంతో పాటు అబార్షన్లు అయ్యాయని కూడా రాసుకోచ్చారు.అలాగే నాకు రహస్యంగా పిల్లలు పుట్టారని నా పిల్లలు రహస్యంగా పెరుగుతున్నారని కూడా మీడియాలో వార్తలు వినిపించాయి. ఇలా నా పెళ్లి గురించి చాలాసార్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ చాలా రోజుల నుండి నాపై వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది పూనమ్ కౌర్. అయితే పూనమ్ కౌర్ మీడియాకి ఈ కౌంటర్ ఇవ్వడానికి కారణం ఇంటర్వ్యూలో మీ పెళ్లెప్పుడు అని ప్రశ్న అడగడంతో ఇప్పటికే నాకు చాలా సార్లు మీడియా పెళ్లి చేసేసిందిగా అని సెటైర్ వేసింది. ఇక సినిమాల్లో అంత యాక్టివ్ గా లేని పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వివాదం గురించి అయినా సరే చాలా తొందరగా స్పందించడంతోపాటు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రస్తావిస్తుంది. ఇక గత కొద్దిరోజుల ముందు త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది.ఇక పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలకి మా అసోసియేషన్ స్పందించి పూనమ్ కౌర్ ఫిర్యాదు చేసినట్టు ఎలాంటి లెటర్ లేదు అని చెప్పడంతో పూనమ్ కౌర్ వెంటనే స్పందించి ఓ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా ఉండే పూనమ్ కౌర్ తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి, పిల్లలు, అబార్షన్ పై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. ఇక పూనమ్ కౌర్ తెలుగులో మాయాజాలం,ఒక 'వి'చిత్రం, వినాయకుడు, శౌర్యం, గగనం, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాల్లో నటించింది.అలాగే తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.