ఫ్యాన్స్‌కు బిగ్ బ్యాడ్ న్యూస్.. ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం..!
అలాగే యాక్షన్ సినిమాల గురించి మాట్లాడిన ఆలియా, తల్లి అయిన తర్వాత ఫిజికల్‌గా భారీ యాక్షన్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, బిడ్డ పుట్టిన తర్వాత వాటిని చేయడం తనకు పెద్ద ఛాలెంజ్‌గా మారిందని వెల్లడించింది. ఈ దశలో తన శరీర సామర్థ్యం ఎంతవరకు ఉందో, తన హద్దులు ఏంటో ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతోందని చెప్పింది.ఈ అనుభవాలన్నింటి నేపథ్యంలోనే తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని ఆలియా భట్ తెలిపింది. ఇకపై ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయకుండా, ఒక్క సినిమా మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. తాను చేస్తున్న పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. కేవలం సినిమాల సంఖ్య పెంచడం కన్నా, క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నానని ఆమె అభిప్రాయపడింది.
స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నప్పటికీ, తల్లిగా తన బాధ్యతలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం నిజంగా అభినందనీయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆలియా భట్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ మాత్రం ఒకవైపు ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆమెను ఎక్కువ సినిమాల్లో చూడలేమేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి అయిన తర్వాత కూడా తన కెరీర్‌ను కొత్త దిశలో, మరింత బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న ఆలియా భట్, రాబోయే రోజుల్లో సెలెక్టివ్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.