యూట్యూబర్ నా అన్వేష్ కు పోలీసులు షాక్..ఏకంగా ఇంస్టాగ్రామ్ కి లేఖ..?
నా అన్వేష్ మీద రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. నా అన్వేష్ మీద నమోదైన ఒక కేసు విషయంలో మాత్రం హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల అన్వేష్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా హిందూ దేవతలను ఉద్దేశించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ దుమారాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలు అటు హిందూ మనోభావాలను కూడా దెబ్బతీసేలా ఉండడంతో హిందువులు కూడా అన్వేష్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలోనే సినీనటి, బిజెపి మహిళా నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్వేష్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆమె ఫిర్యాదులో తెలియజేసింది. ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాలలో తిరుగుతూ వీడియోలు చేస్తున్నారని అతనిని పట్టుకునేందుకు కూడా పోలీసులు వేగంగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం .అంతేకాకుండా అన్వేష్ కి సంబంధించి ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ యూజర్ ఐడి, మిగిలిన వివరాలు, లాగిన్ డేటాకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకునేందుకు ఇన్స్టాగ్రామ్ యజమానికి ఒక లేఖకు కూడా రాశారు. త్వరలోనే అతడికి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.