లాస్ట్ మినిట్ ఊహించని షాక్..ఆ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ నుండి రష్మిక అవుట్..!?

Thota Jaya Madhuri
టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పేరు వినగానే దర్శకులు, నిర్మాతల ముఖాల్లో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్‌లో రష్మికపై ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఒక సినిమాలో రష్మిక ఉందంటే ఆ సినిమా కనీసం 100 కోట్ల కలెక్షన్లు ఖాయం అన్న ధీమాతోనే వారు ముందుకు వెళ్తున్నారు. అలాంటి స్టార్ హీరోయిన్‌తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎగబడి పోతున్నారంటే ఆమె మార్కెట్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రష్మికకు సంబంధించిన ఒక అనూహ్యమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక భారీ ప్రాజెక్ట్ నుంచి రష్మిక మందన్న తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న సినీ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నాయి.

సోషల్ మీడియాలో ముఖ్యంగా సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఉండబోతున్నారు అన్నదానిపై కూడా అనేక ఊహాగానాలు వినిపించాయి. మొదట ఈ పాత్ర కోసం సమంత పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ పాత్ర రష్మిక మందన్న వద్దే ఫైనల్ అయినట్లు టాక్ నడిచింది.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, రష్మిక మందన్న త్వరలోనే ఫిబ్రవరి 26న హీరో విజయ్ దేవరకొండతో వివాహం చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతోంది. పెళ్లి అనంతరం ఆమె తన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. అదే సమయంలో తన సినిమాల ఎంపిక విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకుందట.ఈ కారణాల వల్లే రష్మిక ఈ రామ్ చరణ్ – సుకుమార్ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని టాక్. ఫ్యామిలీ లైఫ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అధికారికంగా రష్మిక గానీ, సినిమా యూనిట్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది.

రష్మిక లాంటి టాప్ స్టార్ హీరోయిన్ ఒక భారీ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం నిజమైతే అది నిజంగా ఇండస్ట్రీలో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆమె ప్రస్తుతం కెరీర్ పీక్స్‌లో ఉండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇక ఈ వార్తలపై నిజానిజాలు ఎప్పుడు బయటపడతాయో, ఈ ప్రాజెక్ట్‌లో చివరకు హీరోయిన్‌గా ఎవరు ఎంపిక అవుతారో చూడాలి. అప్పటివరకు రష్మిక మందన్న పేరు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: