అప్పుడు సుజిత్..ఇప్పుడు మారుతి..ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న డైరెక్టర్స్..!

Thota Jaya Madhuri
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చర్చలు రోజురోజుకు మరింత హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు, దర్శకులు, ట్రైలర్ రిలీజ్‌లు, ఫ్యాన్ రెస్పాన్స్ వంటి అంశాలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘రాజా సాబ్’ సెకండ్ ట్రైలర్ తర్వాత దర్శకుడు మారుతి పేరు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో మారుమ్రోగిపోతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే మారుతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది నెటిజన్లు మారుతిని స్టార్ డైరెక్టర్లతో కంపేర్ చేస్తూ ఆయనను ప్రశంసిస్తున్నారు.


ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మారుతికి వస్తున్న స్పందన గమనించదగినది. ప్రభాస్‌ను రెబెల్ స్టార్‌గా ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో, అదే ఫీలింగ్‌ను మారుతి చాలా నేచురల్‌గా చూపించాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ భారీ విజువల్స్ లేకపోయినా, క్యారెక్టర్ ప్రెజెంటేషన్, ఎలివేషన్, ఎమోషనల్ కనెక్ట్ విషయంలో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్‌ను పూర్తిగా ఇంప్రెస్ చేశాడని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.



ఇదే సమయంలో ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా సూపర్ డూపర్ పిక్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్‌కు ఎంత పేరు వచ్చిందో, అంతే స్థాయిలో ఆ సినిమా దర్శకుడు సుజిత్ కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక ఫ్యాన్ సినిమా ని ఏ రేంజ్‌కు తీసుకెళ్లగలడో సుజిత్ తన దర్శకత్వంతో నిరూపించాడని అభిమానులు, సినీ విమర్శకులు తెగ ప్రశంసలు కురిపించారు.



సుజిత్ విషయంలో ఎలా అయితే “పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సినిమా అంటే ఇలా ఉండాలి” అనే టాక్ వచ్చిందో, ఇప్పుడు అదే తరహా కామెంట్స్ మారుతి విషయంలో కూడా వినిపిస్తున్నాయి. “ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చంగా అలాగే చూపించాడు” అంటూ మారుతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు అయితే, ఓజి సినిమాతో పవన్ కళ్యాణ్ హిట్ కొట్టి దక్కించుకున్న ప్రశంసలకు డబుల్ రేంజ్‌లో మారుతి క్రేజ్ చూడబోతున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.



మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం సుజిత్, మారుతి అనే పేర్లు ఎక్కడ చూసినా మారుమోగిపోతున్నాయి. ఒకరు పవన్ కళ్యాణ్‌తో, మరొకరు ప్రభాస్‌తో పనిచేసి అభిమానుల అంచనాలను అందుకునేలా సినిమాలను రూపొందించారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో దర్శకుల పాత్ర ఎంత కీలకమో మరోసారి నిరూపితమవుతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మారుతి క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఆయనను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టే స్థాయిలో ఈ సినిమా ప్రభావం చూపుతుందని సోషల్ మీడియా మొత్తం ఒకే మాట చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: