హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : ఒక్క సినిమాతో ఉన్న పరువు మొత్తం తీసేసుకున్న టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ హీరో..!
మూవీ మేకర్స్ ఎంత ప్రయత్నించినా, ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిందనే మాట బలంగా వినిపించింది. కథ, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ అన్నీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, సాధారణ ప్రేక్షకులే కాదు, మెగా అభిమానులు కూడా ఈ సినిమాతో తీవ్రంగా నిరాశ చెందారు. ఒకప్పుడు “గ్లోబల్ స్టార్”, “టాలీవుడ్ టాప్ హీరో” అనే ఇమేజ్‌తో ఉన్న రామ్ చరణ్‌కు, ‘గేమ్ ఛేంజర్’ తర్వాత వచ్చిన నెగటివిటీ ఆయన కెరీర్లోనే అరుదైనదిగా మారింది.
అంతేకాదు, సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. ఒక దశలో స్టార్ హీరో నుంచి జీరో స్థాయికి పడిపోయినట్లుగా పరిస్థితి తయారైందని విమర్శకులు వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ ఎంపిక చేసిన కథలపై, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అభిమానులకే కాకుండా సినీ వర్గాల్లో కూడా “ఇక రామ్ చరణ్ పాత గ్లోరీకి తిరిగి రావడం కష్టమేనా?” అనే సందేహాలు మొదలయ్యాయి.అయితే, ఈ నెగిటివిటీ అంతా మధ్యలోనే ఆగిపోయేలా చేసే కొన్ని పెద్ద సినిమా అప్డేట్స్ మళ్లీ ఆయన పేరును వార్తల్లోకి తీసుకొచ్చాయి. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్, వాటి గురించి వస్తున్న లీకులు, అధికారిక ప్రకటనలు అభిమానుల్లో మళ్లీ ఆశలు నింపుతున్నాయి. ముఖ్యంగా ఆయన భవిష్యత్ సినిమాలు కథాపరంగా, మేకింగ్ పరంగా చాలా బలంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
ఇదే క్రమంలో, 2026వ సంవత్సరం మార్చి 27వ తేదీ, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా"పెద్ది" సినిమా రిలీజ్ కాబోతుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఆయన కెరీర్‌కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. సరైన కథ, బలమైన పాత్ర, పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఉంటే రామ్ చరణ్ తిరిగి తన స్టార్‌డమ్‌ను సంపాదించుకుంటాడని ఫాన్స్ విశ్వసిస్తున్నారు. మొత్తానికి, ‘గేమ్ ఛేంజర్’ ఇచ్చిన షాక్ నుంచి బయటపడి, మరోసారి తన ప్లేస్‌ను దక్కించుకోవాలంటే రామ్ చరణ్ ముందు ఉన్న ఈ సినిమానే కీలకం . ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన మళ్లీ టాలీవుడ్ టాప్ స్టార్ల లిస్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడా, లేక ఈ నెగిటివిటీ ఇంకా కొనసాగుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.