చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న హీరో , పెద్ద హీరో .... చిన్న సినిమా , పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలకు దాదాపు ఒకటే టికెట్ ధరలు ఉండేవి. ఏదో ఒకటి , రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచినా కూడా అవి అత్యంత స్వల్పంగా ఉండేవి. దానితో ప్రేక్షకులు సినిమా టికెట్ ధర విషయం లో పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం టికెట్ ధరల విషయం లోనే అనేక చర్చలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పెద్ద సినిమాలకు భారీ ఎత్తున టికెట్ ధరలను పెంచుతున్నారు. దానితో సాధారణ ప్రేక్షకులు నెలలో రెండు , మూడు సినిమాలు చూసే పరిస్థితులు లేవు. దానితో ఏదైనా స్టార్ హీరో సినిమా పెద్ద హీరో సినిమా ఒకటి విడుదల అయింది అంటే దానికి పెద్ద మొత్తం డబ్బును ఖర్చు పెట్టేస్తున్నాడు. దానితో చిన్న సినిమాలకు చూడడానికి థియేటర్ కు సామాన్య ప్రేక్షకులు రావడం లేదు. దానితో సినిమా థియేటర్లను రన్ చేయడం సినిమా థియేటర్ల యాజమాన్యానికి ఎంతో కష్టంగా మారుతుంది అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
దీనితో కచ్చితంగా సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాలు ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలి అనే అభిప్రాయాలను కూడా అనేక మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటో గ్రఫీ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ ఓ కీలకమైన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు తక్కువ టికెట్ ధరలతో సినిమాలను విడుదల చేస్తే ఆ సినిమాలపై ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తూ ఉండడంతో స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువ టికెట్ ధరలను పెట్టేసి , చిన్న సినిమాలకు తక్కువ టికెట్ ధరలను ఫిక్స్ చేస్తే బెటర్ అని ఆలోచన వైపు ఆయన అడుగులు వేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో సినిమా టికెట్ ధరల విషయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.