రాంచరణ్ "పెద్ది"కి తలనొప్పిగా మారిన స్టార్ హీరో..? ఏంట్రా ఈ లొల్లి..!
కానీ తాజాగా అదే రిలీజ్ డేట్ చుట్టూ అనేక రకాల ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మార్చి చివరి వారంలో మరో రెండు భారీ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపించడంతో, ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘పారడైజ్’ సినిమా కూడా 2026 మార్చి చివరి వారంలో విడుదలయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే నాని వరుస హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉండటంతో, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ నాని సినిమా కూడా అదే టైమ్‌లో వస్తే, బాక్సాఫీస్ పోటీ తప్పదని అంటున్నారు.
ఇంతలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాను కూడా 2026 మార్చి 26న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.ఇదే ఇప్పుడు అసలు చర్చకు కారణమవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అదే డేట్‌కు వస్తే, థియేటర్ల డిమాండ్, ఫ్యాన్ క్రేజ్, ఓపెనింగ్స్ పరంగా మిగతా సినిమాలపై తీవ్ర ప్రభావం పడటం సహజమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు, ఇతర హీరోల సినిమాలు ఆ డేట్‌కు దూరంగా వెళ్లడం అనేది ఇండస్ట్రీలో చాలాకాలంగా జరుగుతున్న పరిణామం. థియేటర్ల ఆక్యుపెన్సీ, ఫ్యాన్స్ హడావిడి, బాక్సాఫీస్ ట్రెండ్—అన్ని కలిపి పవన్ సినిమాలకు ప్రత్యేకమైన ఆధిక్యత ఉంటుంది.
అయితే, అదే రోజు రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ ఉండడం వల్ల మెగా అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
* బాబాయ్ కోసం అబ్బాయి సినిమా డేట్ మార్చుతాడా?
* లేదా రెండు సినిమాలు వేర్వేరు తేదీలకు వెళ్తాయా?
* లేదా ఇండస్ట్రీలో పెద్ద క్లాష్ చూడాల్సి వస్తుందా?
ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మెగా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంతమంది కావాలనే మెగా హీరోలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
“సినిమా ఇండస్ట్రీ అంటేనే కాంపిటీషన్. వాళ్ల కుటుంబ హీరోల సినిమాల కోసం అయితే వాళ్ల మూవీలను పోస్ట్‌పోన్ చేస్తారు. మరి మిగతా హీరోల కోసం చేయరా?” అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకసారి మేకర్స్ క్లారిటీ ఇస్తే, 2026 సినిమా రిలీజ్ క్యాలెండర్ మొత్తం మారిపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అప్పటి వరకు ఈ లొల్లి, ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయన్న మాట.