అఖండ 2 : ఐదు రోజుల రిపోర్ట్.. మామూలు దెబ్బ పడేలా లేదుగా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి ..? ఈ సినిమా హిట్టు స్టేటస్ కి ఎన్ని కోట్ల దూరంలో ఉంది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 15.84 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 10.202 కోట్లు , ఉత్తరాంధ్ర లో 4.64 కోట్లు , ఈస్ట్ లో 3.67 కోట్లు , వెస్ట్ లో 2.68 కోట్లు , గుంటూరు లో 4.90 కోట్లు , కృష్ణ లో 3.20 కోట్లు , నెల్లూరు లో 2.39 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు రోజుల్లో ఈ సినిమాకు 47.54 కోట్ల షేర్ ... 75.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఐదు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 5.30 కోట్లు , ఓవర్ సిస్ లో 4.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 57.29 కోట్ల షేర్ ... 96.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 104 కోట్ల బ్రేక్ ఈ వెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 46.71 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: