టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించిన విజయ్ సేతుపతి..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. విజయ్ సేతుపతి ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే అనేక సినిమాల్లో విలన్ , కీలక , ముఖ్య పాత్రలలో నటించాడు. విజయ్ సేతుపతి కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించాడు. తెలుగులో కూడా విజయ్ సేతుపతి పలు సినిమాలలో నటించాడు. మొదటగా విజయ్ సేతుపతి తెలుగు లో చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి అనే సినిమాలో ఓ ముఖ్య మైన పాత్రలో నటించాడు. ఈయన ఉప్పెన మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా విజయ్ సేతుపతి కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కింది.


తాజాగా విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున పై ఆయన ప్రశంశల వర్షం కురిపించాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ... నాగార్జున సార్ గారి వయస్సు ఎందుకు బయటికి తెలియడం లేదు నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆయన వయస్సు పెరిగిన అందం ఏ మాత్రం తగ్గడం లేదు. నాగార్జున గారిపై యాంటీ ఏజింగ్ పరిశోధన జరపాలి. ఇక నాగార్జున గారి జుట్టు కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఎంతో శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది. నా మనవాళ్లు పెద్దయ్యాక కూడా నాగార్జున గారు ఇప్పటిలాగే ఉంటారు కావచ్చు అని విజయ్ సేతుపతి కామెంట్స్ చేశాడు. తాజాగా విజయ్ సేతుపతి , నాగార్జున గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs

సంబంధిత వార్తలు: