ఇంటర్నేషన్ లెవెల్లో నటి ప్రగతి పేరు.. కారణం?
ప్రగతి నిరంతరం జిమ్ వర్కౌట్లు, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేస్తూ ఉంటుంది. అలా 2023లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో ఎన్నో అసాధారణమైన విజయాలను సాధించింది. హైదరాబాదులో జిల్లా స్థాయి పోటీలలో స్వర్ణ పథకాలను సాధించిన ప్రగతి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ లో కూడా బంగారు పథకాన్ని సాధించింది. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని 5వ స్థానంలో నిలిచింది. ఆ వెంటనే బెంగళూరులో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలలో స్వర్ణం కూడా గెలిచింది.
2024 లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్లు రజత పతాకం అందుకుంది. ఈ ఏడాది (2025)ప్రగతి కెరియర్ లోనే చాలా కీలకమని చెప్పవచ్చు. కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్లో గోల్డ్ మెడల్ సాధించింది. తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రగతి అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. ఒకవైపు నటనతో రాణిస్తూనే మరొకవైపు క్రీడలలో తనకున్న పట్టుదలతో జాతీయ ఛాంపియన్ గా నిలవడం గమనార్హం. ఎంతోమంది నటి ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.