ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన చరిత్ర బాలయ్యది.. ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్!

Reddy P Rajasekhar

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య నటించిన అఖండ2 సినిమా విడుదల వాయిదా పడింది.  సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం ఉండగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఒకేరోజు రెండు సినిమాలను విడుదల చేసిన చరిత్ర బాలయ్యది అంటూ మేకర్స్ పై బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.

1993 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన బాలయ్య నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.  ఈ సినిమాలలో బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా  నిప్పురవ్వ యావరేజ్ గా నిలిచింది.  మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అనగా సినిమాను వాయిదా వేయడం ఏంటని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

నైజాంలో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయకుండా మంచి పని చేశారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమా వాయిదాతో ఇప్పటికే  టికెట్లను బుక్ చేసుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.  14 రీల్స్ బ్యానర్ పేరు వింటేనే  అభిమానులకు చిరాకు, కోపం వస్తున్నాయి. వివాదం ముగిసి సినిమా  విడుదలవుతుందని  అభిమానులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

స్టార్ హీరోల సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నప్పుడు నిర్మాతలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన  అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యలు అన్నీ పరిష్కారమై త్వరలోనే అఖండ2 కొత్త డేట్ కు అయినా విడుదల కావాలని ఫ్యాన్స్  భావిస్తున్నారు.  ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చిన సినిమాకు ఈ విధంగా జరగడం అభిమానులను మాత్రం ఎంతగానో బాధ పెడుతోంది.



ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: