అత్తారింట్లో గ్రాండ్ వెల్కమ్.. సమంత కొత్త ఫ్యామిలీని చూశారా?
పెళ్లి తర్వాత ఇద్దరూ కుటుంబసభ్యులతో దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు స్వయంగా షేర్ చేసిన ఈ పిక్, సమంత కొత్త కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఫోటోలో రాజ్ తల్లిదండ్రులు, శీతల్, ఆమె ముగ్గురు కుమారులు ఒకచోట చేరడంతో… సమంతకు అత్తారింట్లో జరిగిన గ్రాండ్ వెల్కమ్ స్పష్టంగా కనిపించింది.
కాగా, రాజ్ నిడిమోరుతో 2020 చివరి నుంచి సమంత సన్నిహితంగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్. కానీ ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయటి ప్రపంచానికి చెప్పకుండా… పూర్తి ప్రైవేట్‌గా ఉంచుకున్నారు. సమంత విడాకుల తరువాత మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రాజ్ ఆమెకు పెద్ద సపోర్ట్‌గా నిలిచినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయ్యిందని.. ఇప్పుడు ఆ బాండింగ్ పెళ్లికి దారితీసిందని అంటున్నారు.