నార్త్‌లో అఖండ 2 .. ఆ ఛాలెంజ్ అధిగమిస్తుందా... ?
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ సినిమా అభిమానులకు పండుగ. ఈ హిట్ కాంబో నుంచి వస్తున్న అఖండ 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం ఓటీటీలో ఉత్తర భారత ప్రేక్షకుల్లో సాలిడ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే ఈసారి మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే నార్త్ మార్కెట్‌లో అఖండ 2 ప్రచారం మొదలైపోయింది. అక్కడ బాలయ్యకు ఉన్న ఓటీటీ క్రేజ్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో అఖండ2 కి ఊహించని పోటీ ఎదురైంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అదే డిసెంబర్ 5న విడుదల కానుంది. దురంధర్ ట్రైలర్ విడుదలయ్యాక హిందీ బెల్ట్‌లో పెద్ద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
యాక్షన్, విసువల్స్, రణ్వీర్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి ఆ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. దీంతో నార్త్‌లో అఖండ 2 బాక్సాఫీస్ రన్‌కు కఠినమైన పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అఖండకు దక్షిణంలో ఉన్న క్రేజ్ వేరేలా ఉన్నప్పటికీ, హిందీ మార్కెట్‌లో మాత్రం పోటీ కీలకం. అక్కడ మొదటి రోజే స్క్రీన్ షేర్లు, షోస్, ప్రచారం ఎంత బలంగా ఉంటే, కలెక్షన్లు కూడా అంతే బలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో దురంధర్ నుంచి వచ్చే గట్టి పోటీతో పాటు ఆ సినిమాకు వచ్చచే టాక్ అఖండ 2పై పడే అవకాశముంది. అయితే బాలయ్య మాస్ నటన , బోయపాటి మాస్ టచ్, థమన్ సంగీతం కలిసి సీక్వెల్‌ను నార్త్ లోనూ భారీ అంచనాలతో శిఖర భాగాన కూర్చోపెట్టాయి. అఖండ 2 ఈ పోటీని అధిగమించి నార్త్‌లో కూడా రన్ అయితే, అది నిజంగా ‘తాండవం’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.