ఫాలోయింగ్ సంగతి సరే కానీ మరి అది ఎక్కడ భాగ్యశ్రీ పాప..?
కుమారి పాత్రకు వచ్చిన రెస్పాన్స్‌పై భాగ్యశ్రీ కూడా చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యింది. “నన్ను నేను నటిగా నిరూపించుకోవడానికి అవకాశమిచ్చిన సినిమా ‘కాంత’. ప్రేక్షకులు నా గ్లామర్ మాత్రమే కాదు, నా నటనను కూడా ఇష్టపడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అనుష్క నా ఫేవరెట్. ఆమె చేసిన ‘అరుంధతి’ లాంటి ఐకానిక్ రోల్స్ నాకు రావాలని ఎంతో కోరుకుంటున్నాను,” అని ఆమె చెప్పింది. నిజం చెప్పాలంటే, ఆమె చెప్పింది వినగానే చాలా మందికి అనుష్క కెరీర్ గుర్తుకు వచ్చింది. అనుష్క కూడా మొదట ‘సూపర్’ లాంటి కమర్షియల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎంతో త్వరగా ‘అరుంధతి’ రూపంలో ఒక భారీ బ్లాక్‌బస్టర్ ఆమెను ఇండస్ట్రీలో స్టార్‌గా నిలబెట్టింది. అదే విధంగా భాగ్యశ్రీకీ కూడా ప్రస్తుతం మంచి ఫాలోయింగ్ ఉంది, యాక్టింగ్ స్కిల్స్ కూడా ప్రూవ్ అయ్యాయి. కానీ ఆమెకి అత్యవసరం అయిన ఒక్కటే… ఒక సాలిడ్ హిట్!
ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఈ కాలంలో ‘హిట్ హీరోయిన్’ అనిపించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్క హిట్ చాలదు, ఆ హిట్‌తో వచ్చే మార్కెట్‌నే తర్వాతి అవకాశాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆమె రాబోయే ‘ఆంధ్ర కింగ్’పై ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ కొడితే… భాగ్యశ్రీ కెరీర్ పూర్తిగా సెటైపోయే అవకాశం ఉంది. అంతా ఇప్పుడు ఓ హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఆ హిట్ ఆమెతో పాటు వస్తుందా? లేక ఆమె ఇంకా హంటింగ్ కొనసాగించాలా? అన్నది చూడాల్సిందే.