కుష్బూ తనపై ఏ చిన్న అలిగేషన్ వచ్చినా కూడా కచ్చితంగా స్పందిస్తుంది. అలాగే తనని సోషల్ మీడియాలో ఎవరైనా టార్గెట్ చేస్తే వారికి ఇచ్చి పడేస్తుంది. అయితే అలాంటి కుష్బూ తాజాగా రజినీకాంత్ అభిమానులపై ఫైర్ అయింది.దానికి కారణం రీసెంట్ గా కమల్ హాసన్ రజినీకాంత్ కాంబోలో వస్తున్న సినిమా నుండి కుష్బూ భర్త డైరెక్టర్ గా తప్పుకోవడమే గత కొద్ది రోజులుగా రజినీకాంత్,కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు డైరెక్టర్ గా సుందర్ సీ తీసుకున్నట్టు కూడా అఫీషియల్ గా ప్రకటించారు. కానీ సడన్గా సుందర్. సి కి ప్రాజెక్టు నచ్చకపోవడం వల్లనో ఏం జరిగిందో ఏమో కానీ సినిమా నుండి తప్పుకున్నారు.సినిమా నుండి తప్పుకున్నట్టు కూడా కమల్ హాసన్ తెలియజేశారు.మరో మంచి డైరెక్టర్ కోసం వెతుకుతున్నామని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే కొంతమంది రజినీకాంత్ అభిమానుల పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో సుందర్ సి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కొంతమంది రజిని ఫ్యాన్స్ ముసుగులో ఉన్న వాళ్లు కుష్బూని టార్గెట్ చేస్తూ షాకింగ్ పోస్టులు పెట్టారు. అందులో ఓ నెటిజన్..సుందర్ సి దయనీయమైన కథనం కారణంగా నీ భర్త సుందర్ సి ని రజినీకాంత్ ని తమ సినిమా నుండి తీసివేశారు. భారతీయ సినీ పరిశ్రమకు నీ భర్త సుందర్ ని చెత్తబుట్టలో పడేసే సమయం ఆసన్నమైంది అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ కి కుష్బూ తనదైన శైలిలో రిప్లై ఇస్తూ నా చెప్పు సైజు 41 ..నా చెప్పు దెబ్బలు తినడానికి మీరు రెడీగా ఉన్నారా.. అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.
ఇక మరో నెటిజన్ రజినీకాంత్ తన సినిమాలో కుష్బూని ఐటెం సాంగ్ చేయమని అడిగాడు. అందుకే డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అని కామెంట్ పెట్టగా.. దీనికి కుష్బూ లేదు లేదు ఐటెం సాంగ్ కోసం మీ కుటుంబం నుండి ఎవరినైనా తీసుకోవాలని ఆలోచిస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో రజినీకాంత్ అభిమానులు పెట్టే అసభ్య కామెంట్లకు కుష్బూ తనదైన శైలిలో ఇచ్చిన రిప్లై కి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.అలా ఒక డైరెక్టర్ ప్రాజెక్టు నుండి తప్పుకుంటే తమ ఫ్యామిలీని ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అవసరమా అంటూ మిగతా నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రజినీకాంత్ అభిమానులు చేసిన పని వల్ల ఆయనకి తల వంపులు వస్తున్నాయి.