వెంకీ తో అలాంటి పని చేయిస్తున్న త్రివిక్రమ్ ..గురూజీ ధియేటర్లు తగలబెట్టేదామా..?
అంటే, నిజ జీవితంలో కుటుంబ సభ్యులు ఎలా మాట్లాడుకుంటారో అచ్చం అలాగే డైలాగ్స్ రాసి, నటులతో ముందే వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో నెటిజన్లు సరదాగా, “ఏం గురూజీ… డైరెక్ట్‌గా ఇంట్లో జరిగే మస్త్ కామెడీని స్క్రీన్‌పైకి తీసుకురాబోతున్నారా? థియేటర్లు నవ్వులతో తగలబెట్టేద్దామా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద గారు’ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి 2026 నాటికి విడుదల కానుంది.
చిరు సినిమా షూట్‌లో తన భాగాన్ని పూర్తిచేసుకున్న వెంటనే వెంకటేష్–త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. అందాల భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందన్న వార్త ఇప్పటికే సినిమా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్, వెంకటేష్ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్—అన్ని కలిస్తే ఈ చిత్రం 2026లో భారీ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!