తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమా ద్వారా ఈమెకు నటిగా మంచు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు చందమామ సినిమాతో కమర్షియల్ విజయం దక్కింది. ఈ సినిమాలో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడం , అలాగే తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత ఈమె నటించిన మగధీర సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్టు కావడంతో కాజల్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా అనేక సంవత్సరాల పాటు అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగించింది. ఇప్పటికి కూడా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ గుర్తింపు కలిగిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. కొంత కాలం ఈమె బాలకృష్ణ హీరో గా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ తర్వాత ఈమె సత్యభామ అని లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాల తర్వాత ఈమె ఏదో అడపా దడప సినిమాలకు ఓకే చెప్తున్నా వరుస పెట్టి సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దానితో ఈమె అభిమానులు కాజల్ అగర్వాల్ కి అద్భుతమైన గుర్తింపు ఉంది. ఆమె ఇప్పటికి యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గిపోని రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె వరుస పెట్టి సినిమాలు చేస్తే కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది అని ఆమె అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.