రజిని.. లోకేష్ మధ్య అంత పెద్ద విషయం జరిగిందా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో లోకేష్ కనకరాజు ఒకరు. లోకేష్ కనకరాజు కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ హైప్ మధ్య విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోడంలో విఫలం అయింది. ఇకపోతే లోకేష్ రజనీ కాంత్ తో కూలీ సినిమాను రూపొందిస్తున్న సమయం లోనే లోకేష్ , రజనీ కాంత్ మరియు కమల్ హాసన్ హీరోలుగా ఓ భారీ ప్రాజెక్ట్ ను రూపొందించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.


ఇక ఆ వార్తలకు తగ్గట్లు గానే కూలీ సినిమా విడుదల అయిన తర్వాత లోకేష్ , రజిని కాంత్ మరియు కమల్ హాసన్ లకి ఓ కథను వివరించగా వారిద్దరు కూడా ఆ కథను రిజెక్ట్ చేశారు అని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో కమల్ హాసన్ ను అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది.


ఇక లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రజనీ కాంత్ ను అన్ ఫాలో చేయడానికి ప్రధాన కారణం ... ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా అనుకొని తయారు చేసిన కథను రజనీ కాంత్ కు వినిపించగా ఆయన దానిని రిజెక్ట్ చేయడం తోనే లోకేష్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు అని , అందుకే లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ నుండి రజనీ కాంత్ ను అన్ ఫాలో చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా లోకేష్ చాలా తక్కువ సినిమాలతోనే అద్భుతమైన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ గత కొంత కాలంగా మాత్రం ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: