నందమూరి హీరోలలో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి గుర్తుకు వచ్చే హీరో అంటే ఎన్టీఆర్ మాత్రమే.ఇక సీనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణలు ఉన్నప్పటికీ ఇప్పటి యూత్ కి మాత్రం ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.ఆయన డాన్స్, యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ పై తాజాగా ఓ బాలీవుడ్ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇక్కడితో జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ క్లోజ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ ఎన్టీఆర్ కెరీర్ పై ఇలాంటి కామెంట్లు చేసిన ఆ క్రిటిక్ ఎవరు.. ఎందుకు ఇలాంటి చెత్త కామెంట్లు చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఆ తర్వాత ఈ ఏడాది బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 తో మూవీలో నటించారు. ఈ సినిమాలో హృతిక్,ఎన్టీఆర్ ల యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయ్యారు. కానీ ఎందుకో గానీ ఈ సినిమా థియేటర్లలో హిట్ కాలేకపోయింది. కానీ ఓటిటిలో ఈ సినిమాకి చాలామంది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే వార్-2 మూవీ రిజల్ట్ తో బాలీవుడ్ క్రిటిక్ కమల్.ఆర్.కె అంటే కె.ఆర్. కె అని పిలవబడే సినీ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హిందీలో వార్ 2 మూవీ చేశారు.కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
కాబట్టి ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కెరీర్ ఇక్కడితో ముగిసిపోయింది. అలాగే వార్ టు సినిమా చేసిన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వాళ్ళు కూడా హృతిక్ రోషన్ నటించబోయే క్రిష్-4 సినిమాని చేయకూడదని ఫిక్స్ అయ్యారు.అంతేకాదు వార్ 2 మూవీకి డైరెక్షన్ చేసిన అయాన్ ముఖర్జీని కూడా ధూమ్ -4 మూవీ నుండి తొలగించారు. ఇక యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో హృతిక్ రోషన్ ఇప్పటినుండి పనిచేయడు. అలాగే ఎన్టీఆర్ తో ఉన్న ప్రాజెక్టును కూడా రిజెక్ట్ చేశారు. ఇక ఇక్కడితో ఎన్టీఆర్ హిందీ కెరియర్ కి ఎండ్ కార్డ్ పడ్డట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ క్రిటిక్ కేఆర్ కె. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించడంతో చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈయనపై మండిపడుతున్నారు