అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ..డబుల్ జాక్ పాట్ ఆఫర్ ఇది..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా చేయలేని కంటెంట్ ని  నేచురల్ స్టార్ నాని టచ్ చేసి రికార్డ్స్ సాధిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌నే, కానీ హై కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుసగా హిట్స్ ఇస్తూ, ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.నాని చివరిగా చేసిన హిట్ 3 సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. "సాఫ్ట్ హీరో" అనుకున్న నానిలో ఇంత వైలెన్స్ దాగుందా..??? అంటూ షాక్ అయ్యారు. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా "దీ పారడైజ్". ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ బయటకు రాగానే అభిమానులలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. నాని ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లు ఎంచుకుని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.



నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "దీ పారడైజ్" చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. షూటింగ్ పూర్తయ్యాక వెంటనే నాని, దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఇది స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని, 2026 చివర్లో విడుదల కాబోతుందని టాక్. ఆ తర్వాత నాని కమిట్ అయిన డైరెక్టర్ – "హాయ్ నాన్న" ఫేమ్ శౌర్యవ్. హాయ్ నాన్న తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని అభిమానులు ఊహించలేదు. కానీ మళ్లీ శౌర్యవ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాని ఓకే చేయడం సంచలనంగా మారింది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా కథ నానిని బాగా ఆకట్టుకోవడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.



ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి రెడీ అవుతోందని టాక్. శౌర్యవ్ గత సినిమా కంటే పూర్తిగా విభిన్నమైన జానర్‌లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన 2026 సంక్రాంతి సమయంలో వెలువడే అవకాశం ఉంది. అంటే, సుజిత్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ మొదలుకాబోతుందని అర్థం. ఇలా వరుసగా సెన్సేషనల్ డైరెక్టర్లతో నాని కమిట్ అవుతూ, కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ఆయన రేంజ్ మరో స్థాయికి చేరుకోబోతుందని అభిమానులు అంటున్నారు. నాని ఎలాంటి రికార్డ్స్ తన ఖాతాలో వేసుకోబోతున్నారో చూడాలి మరి..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: