ఘాటి ప్రమోషన్స్‌లో పవన్ సర్‌ప్రైజ్ క్రిష్ క్లారిటీ స్టేట్‌మెంట్..!

Thota Jaya Madhuri
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అద్భుతమైన క్రేజ్. ఆయనతో పని చేసే అవకాశం వస్తే ఎవరు అయినా వదులుకోవడం కష్టం . అలాంటి అవకాశమే దర్శకుడు క్రిష్‌కి వచ్చింది . పవన్ తో చేసిన భారీ హిస్టారికల్ ఎపిక్ “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలుసు . కానీ పరిస్థితులు , వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది . ఈ విషయం పై ఆయన మనసులోని బాధను బయటపెట్టారు . అయితే అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు .

 

“వీరమల్లు” మిస్ అయినా.. పవన్ కళ్యాణ్ తో మరోసారి తప్పకుండా సినిమా చేస్తా అని క్లియర్ గ్యారెంటీ ఇచ్చారు . ఇటీవల “ఘాటి” ప్రమోషన్స్ లో పాల్గొన్న క్రిష్ మాట్లాడుతూ , పవన్ కోసం ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ కథని సిద్ధం చేస్తున్నానని చెప్పారు . “ఎప్పటికైనా ఆయనతో మళ్లీ పని చేయాలి. ఈసారి మరింత పెద్ద కేన్వాస్‌లో, పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు ఒక ఎపిక్ స్టోరీ చెబుతా” అని పబ్లిక్‌గా మాటిచ్చారు . ఇదే ఫ్యాన్స్‌కి ఇప్పుడు భారీ ఎగ్జైట్మెంట్‌కి కారణమైంది. “వీరమల్లు”లో క్రిష్ చెప్పే విజన్ ఏమిటో మిస్ అయినా.. రాబోయే ప్రాజెక్ట్‌లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా చూపిస్తాడనేది అంచనాలు. పవన్–క్రిష్ కాంబినేషన్ అంటే కంటెంట్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌కి బలమైన మిశ్రమం ఉంటుందని టాక్.



 ఇక క్రిష్ దృష్టిలో “ఘాటి” కూడా చాలా క్రూషియల్ సినిమా. అనుష్క లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో మాస్ టచ్ కలిపి క్రిష్ మరోసారి తన క్రాఫ్ట్‌ని చూపించబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. మొత్తానికి, “ఘాటి” తర్వాత క్రిష్ దృష్టి పవన్‌పై ఉండబోతుంది. “వీరమల్లు” మిస్ అయినా.. మళ్లీ పవన్‌తో రాబోయే సినిమా మాత్రం భారీగా హైప్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్యాన్స్ కూడా అదే కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: