సూర్య సినిమాలో ఆ హీరో భార్య.. ఆ ఇండస్ట్రీ మెయిన్ టార్గెట్..?

Pulgam Srinivas
తమిళ సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో సూర్య ఒకరు. సూర్య ఇప్పటివరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమాలో నటించకపోయినా ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. దానితో సూర్యకు తెలుగులో కూడా సూపర్ సాలిడ్ గుర్తింపు ఉంది. సూర్య నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి.


తాజాగా సూర్య నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సూర్య హీరో గా నటించబోయే ఓ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ సూర్య సరసన ఈమెను ఓకే చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కుడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. నజ్రియా నజీమ్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈమె ఎక్కువ శాతం మలయాళ సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి అనే తెలుగు మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది.


మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. నజ్రియా కు మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. దానితో సూర్య తన నెక్స్ట్ మూవీ తో మలయాళ ఇండస్ట్రీ ని టార్గెట్ చేసినట్లు ఉన్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మలయాళ స్టార్ నటుడు అయినటువంటి ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్. వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: