పోనీలే అని ఛాన్స్ ఇస్తే ఈ అట్లీ మరీ ఓవర్ చేస్తున్నాడే..బన్నీ ఫ్యాన్స్ హర్ట్..!
నిజానికి, ‘పుష్ప’ సినిమా లాంటి క్రేజీ హిట్ తర్వాత, అల్లు అర్జున్‌కి అనేక మంది డైరెక్టర్స్ అవకాశాలు ఇచ్చారు. అప్పటికే బన్నీ..కూడా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమాకు కమిట్ అయినప్పటికీ, పెద్ద పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కావాలనే ప్రణాళిక తో ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుని మరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొనసాగించారు. బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా బన్నీ ఇంటికి వచ్చి అవకాశాలు ఇచ్చారని వార్తలు వినిపించాయి. అయితే, అందరిని వెనక్కి పెట్టి, అట్లీకి మాత్రమే అవకాశం ఇచ్చారు.
అప్పట్లో అల్లు అర్జున్ – అట్లీ కాంబోపై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు. ఇప్పుడు ఫుల్ డిసప్పయింట్ అవుతున్నారు. ముఖ్యంగా, సినిమా కి సంబంధించి ఏ విధమైన అధికారిక అప్డేట్ కూడా విడుదలకాకపోవడం వల్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. “పోనీలే అని ఛాన్స్ ఇస్తే అట్లీ ఎందుకు ఇంత నెగ్లెజెన్సీ గా వ్యవహరిస్తున్నారు?” అనే రకమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు కూడా ఏదో తేడా కొడుతుంది ఈ ప్రాజెక్ట్ మ్యాటర్ లో అంటూ ఘాటు గా రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ కూడా అట్లీ బిహేవియర్‌పై సైలెంట్‌గా ఉండటం కొత్త డౌట్లు సృష్టిస్తోంది. తెర వెనుక ఏదో పెద్ద ప్లాన్ అమలులో ఉందని, ఆ ప్లాన్ ప్రకారం ఫ్యాన్స్‌కు సంతోషకరమైన అప్డేట్ త్వరలో రాబోతుందనేది ఇంకొందరి మాట. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు విడుదల చేస్తారో? అభిమానులను ఎలా సాటిస్ఫై చేస్తారో? వేచి చూడాలి..!!