భార్య కోసం త‌ల్లికి దూరం.. నాగ శౌర్యపై ఉషా సంచ‌ల‌న వ్యాఖ్యలు

Kavya Nekkanti
టాలీవుడ్‌లో తన స్వంత స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ శౌర్య. ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు కాకుండా, వైవిధ్యాన్ని చూపించాలని ప్ర‌య‌త్నించే నాగ శౌర్య‌.. 2023లో వ‌చ్చిన `రంగబలి` త‌ర్వాత సైలెంట్ అయ్యాడు. చిన్న గ్యాప్ తీసుకున్న ఆయ‌న ప్ర‌స్తుతం `పోలీస్ వారి హెచ్చరిక`, `బ్యాడ్ బాయ్ కార్తీక్`, `నారి నారి నడుమ మురారి` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు సొంతగా `ఇరా క్రియేషన్స్‌` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి, తన తల్లి ఉషా ముల్పూరితో క‌లిసి సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నారు.


ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఈ హ్యాండ్స‌మ్ హీరో 2022లో ఓ ఇంటివాడు అయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనుషా శెట్టిని నాగ శౌర్య వివాహం చేసుకున్నాడు. అప్ప‌టివ‌ర‌కు త‌ల్లిదండ్రుల‌తో క‌లిసున్న శౌర్య‌.. పెళ్లైన వెంట‌నే వేరు కాపురం పెట్టేశాడు. భార్య‌తో క‌లిసుండేందుకు త‌ల్లికి దూరం అయ్యాడు. ఇదే విష‌యాన్ని లేటెస్ట్ ఇంట‌ర్వ్యూలో శౌర్య త‌ల్లి ఉషా ప్ర‌స్తావిస్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు. నాగ శౌర్య‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


పెళ్లయ్యాక కలిసుండను అని నాగ శౌర్య చిన్నప్పుడే చెప్పేవాడు. చెప్పిన‌ట్లే చేశాడు. ఇద్దరు మంచివాళ్లు ఒకేచోట ఉండకూడదు అనే నమ్మకం అతనిది. అందుకే మాతో కాకుండా శౌర్య, అనుషా వేరే ఇంట్లో ఉంటున్నారు. కానీ కొడుకు, కోడ‌లు వేరు ఉండ‌టం చాలా బాధ‌గా అనిపిస్తుంద‌ని ఉషా పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ.. `నాకు ఇద్ద‌రు కొడుకు.. చిన్న‌త‌నంలో వారికి ఆస్త‌మా ఉండ‌టంతో స్కూల్‌కు పంప‌కుండా ఇంటి ద‌గ్గ‌ర ఉంచే చ‌దివించేదాన్ని. అలా వారితో రోజంతా టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడు వాళ్లు పెద్దై పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్ట‌డంతో ఇల్లు బోసిపోయినట్లు అనిపిస్తోంది` అంటూ ఉషా భావోద్వేగానికి లోనయ్యారు. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. కాగా, ఉషా ప్ర‌స్తుతం నిర్మాణ రంగంలోనే కాకుండా రెస్టారెంట్ బిజినెస్ ర‌న్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఆమెకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: