మెగా ఇంటికి కోడలు అవ్వాల్సిన నివేదా..సడెన్ గా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది..?

Thota Jaya Madhuri
నివేదా పేతురాజ్ అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. అందానికి అందం, టాలెంట్‌కి టాలెంట్‌, నటనకి నటన అన్నీ కలగలిసిన ఈ హీరోయిన్ అందరికీ సుపరిచితురాలే. తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ అంటే పడి చచ్చిపోయే కుర్రాళ్లు చాలామంది ఉంటారు. ఈ అమ్మడు "మెంటల్ మదిలో" సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఆ తర్వాత తనదైన స్టైల్‌లో ముందుకు వెళుతూ, తన పేరుని బాగా వైరల్ అయ్యేలా చేసుకుంది. ముఖ్యంగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన "చిత్రలహరి" సినిమాలో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలైట్‌గా మారి, హీరోయిన్ కన్నా బాగా పాపులారిటి సంపాదించుకుంది. ఆ తర్వాత రెడ్, కాదల్, పిశాచి వంటి సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ అని నిరూపించుకుంది. ఇక అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకుంది.



ఒకవైపు తెలుగు, మరోవైపు తమిళ్..రెండు భాషలను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ అవకాశాలు అందుకుంటూ వచ్చింది. రీసెంట్‌గా తాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని బయటపెట్టింది. తనకు కాబోయే వరుడి ఫోటోలను షేర్ చేసింది. సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నివేదా పేతురాజ్ ప్రముఖ వ్యాపారవేత్త రాజాహితిబీర్‌ను పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి చాలామంది “మీ జంట బాగుంది” అంటూ కంగ్రాట్యులేషన్స్ చెబుతుంటే, మరికొందరు మాత్రం ఆమె గత ఎఫైర్స్‌ని బయటకు తీస్తూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో నివేదా పేతురాజ్ స్టార్స్‌తో రిలేషన్‌లో ఉందని, ముఖ్యంగా కోలీవుడ్‌లో ఒక స్టార్‌తో బాగా మింగిల్ అయ్యిందని, ఆయన దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకుందని..ఆయనను పెళ్లి కూడా చేసుకోవాలు అని అనుకున్నిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో కూడా ఆమె రిలేషన్ బాగా ముందుకు వెళ్లిందని, ఒకానొక సమయంలో “మెగా ఇంటి కోడలు కాబోతుంది నివేదా పేతురాజ్” అనే వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు ఈ విషయంపై క్లారిటీ తీసుకొని, “ఇది అంతా ఫేక్” అని తేల్చేసారట. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాంటి రూమర్స్‌ను పట్టించుకోకూడదని స్పష్టం చేశారట. ఆ సమయంలో సాయిధరమ్ తేజ్ ..నివేదతో రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు రావడంతో ఆయన తల్లి బాగా కంగారుపడిందట. దాంతో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి క్లారిటీ తీసుకొని, అసలు అలాంటి విషయం లేదని తేల్చేశారట. సోషల్ మీడియాలో పుట్టిన ఆ పుకార్ల కారణంగానే “మెగా ఇంటి కోడలు” అనే పెళ్లి వార్త రద్దయినట్లైంది. ప్రస్తుతం నివేదా పేతురాజ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: