మెగా డీఎస్సి మెరిట్ జాబితాపై అప్ డేట్.. అభ్యర్థులకు కీలక సూచనలు ఇవే!

Reddy P Rajasekhar
ఏపీ మెగా డీఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఈ పరీక్షకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తైన నేపథ్యంలో ఈ నెల 22 నుంచి మెరిట్ లిస్ట్ లు రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు మెగా డీఎస్సి కన్వీనర్ తెలిపారు. ఈ మెరిట్ జాబితా డీఎస్సి అధికారిక వెబ్ సైట్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. వేర్వేరు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నారు.

ఉపాధ్యాయ నియామక ప్రక్రియ  పారదర్శకంగా జరుగుతోందని  అర్హత ఉన్న అభ్యర్థులకు పారదర్శకంగా నియమించడమే  ప్రభుత్వం దృఢ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు.  కాల్ లెటర్ ను పొందిన అభ్యర్థులు  ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు  క్యాస్ట్ సర్టిఫికెట్,  జిరాక్స్ కాపీలు,  పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరు కావడానికి ముందే  వెబ్ సైట్ లో సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయడం తప్పనిసరి అని తెలుస్తోంది. వెరిఫికేషన్ టైం లో సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికెట్ల  చెక్ లిస్ట్ ను డీఎస్సి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.  వెరిఫికేషన్ కు హాజరు కాకపోయినా  సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయకపోయినా  తగిన విద్యార్హతలు లేకపోయినా మెరిట్ లిస్ట్ లో తర్వాత ఉన్న అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది,

టీచర్ జాబ్ ఇప్పిస్తామంటూ  దళారులు చెప్పే మాటలను,  సోషల్ మీడియా  వేదికగా వచ్చే అసత్య వదంతులను నమ్మొద్దని  కోరారు.  మెగా డీఎస్సి వెబ్ సైట్,  క్యాండిడేట్ లాగిన్ లలో  ప్రభుత్వం రిలీజ్ చేసే ఉత్తర్వుల ద్వారా నియామకాల గురించి తెలియజేయనున్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: