డైరెక్టర్ గా మారిన చరణ్ లక్కి హీరోయిన్..హీరో ఎవరో తెలిస్తే కుల్లుకుని చచ్చిపోవాల్సిందే..!

Thota Jaya Madhuri
ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతుంది. ఒకప్పుడు అందాలను ఆరబోసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు రకరకాలుగా లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుండగా, మరికొందరు అక్క పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకొందరు ఆంటీ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమ లైఫ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే చాలా రేర్ బ్యూటీస్ మాత్రమే గ్లామర్ ఫీల్డ్ నుంచి డైరెక్షన్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఆ లిస్టులోకి జాయిన్ అయ్యింది ‘చిరుత’ సినిమా హీరోయిన్ నేహా శర్మ. ఈ సినిమాలో ఆమె నటన, పెర్ఫార్మెన్స్, వలకబోసిన అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘లవ్ యూ రా’ సాంగ్‌లో ఆమె అందాలను కుర్రాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. తొలి సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించిన బ్యూటీగా రికార్డు క్రియేట్ చేసింది.



ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు సినిమాల్లో అలరించినా నేహా శర్మకు హిట్ మాత్రం అందలేదు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆమె, తరువాత సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఆమె డైరెక్టర్గా మారిపోయింది. ఇదే న్యూస్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. నేహా శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాక సంఘటన ఆధారంగా 1945 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సిద్ధాంత్ చతుర్వేది, అలాగే మోహిత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.



ఇది నిజంగా ఆమెకు లక్కీ చాన్స్. స్టార్టింగ్ సినిమాతోనే స్టార్స్‌ను ఆకర్షించడం హైలైట్ పాయింట్ అని అభిమానులు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిలబెట్టేందుకు నేహా శర్మ పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం పూర్తిగా పనులు చకచకా జరుగుతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.,ఈ చిత్రంతో ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ దర్శకురాలిగా కూడా మంచి పేరు సంపాదించుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: