వినాయకచవితిని జారవిడుచుకున్న టాలీవుడ్ !
అయితే ఈసారి చవితి పండుగ మటుకు ఎటువంటి హడావిడి లేకుండా సినిమాల విషయంలో మౌనంగా వెళ్ళిపోయే ఆస్కారం కానిపిస్తోంది. భారీ సినిమాలు ‘కూలీ’ ‘వార్ 2’ సినిమాలకు సంబంధించిన కలక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 27న రాబోతున్న ‘వినాయకచవితి’ పండుగనాడు ఒక మంచి సినిమా విడుదలై ఉంటే ధియేటర్లు కళకళలాడేవి.
గతవారం విడుదలైన రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ ల మూవీలు నిరాశ పరచడంతో సరైన కమర్షియల్ సినిమా చవితి పండుగనాడు విడుదలై ఉంటేధియేటర్లు కళకళలాడేవి. అయితే రవితేజ మూవీ ‘మాస్ జాతర’ వాయిదా పడటంతో ఇప్పుడు ఆ స్థానంలో విడుదల చేయడానికి మరో సినిమా లేకపోవడంతో ధియేటర్లు ఖాళీగా మారుతున్నాయి.
వాస్తవానికి రెండు చిన్న సినిమాలు ‘సుందరాకాండ’ ‘త్రిబాణాధారి’ విడుదల అవుతున్నప్పటికీ ఆ రెండు సినిమాల పై ఏమాత్రం క్రేజ్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆ రెండు సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోవడంలేదు. ఆ రెండు సినిమాలలో ఏఒక్క దానికైనా టోటల్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా ఈ చిన్న సినిమాల హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. అనుష్క నటించిన సెప్టెంబర్ మొదటి వారంలో రాబోతున్న ‘ఘాటి’ ‘మిరాయ్’ మూవీలలో ఏఒక్క సినిమా అయినా ‘వినాయకచవితి’ నాడు విడుదల చేసి ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకులలో ఉన్నప్పటికీ ఈవిషయం పై ఈ సినిమా నిర్మాతలు ఎందుకు దృష్టి పెట్టలేదు అన్న సందేహాలు వస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ మూవీ తప్ప సినిమా అభిమానులకు పండుగరోజునాడు చూడటానికి మరొక సినిమా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ పండుగ వీకెండ్ ను జారవిడుచుకుంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..