`విశ్వంభ‌ర` రిలీజ్ డేట్ లీక్ చేసేసిన చిరు.. మెగా ఫ్యాన్స్‌కు నేడు బిగ్ ట్రీట్‌!

Kavya Nekkanti
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `విశ్వంభర`. వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సోసియో ఫాంటసీ ఫిల్మ్‌ను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చెన్నై సోయ‌గం త్రిష హీరోయిన్ కాగా.. ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్‌ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ డిలే అవుతూ వస్తోంది. అయితే తాజాగా విశ్వంభర రిలీజ్ డేట్ పై చిరంజీవి అదిరిపోయే లీక్‌ ఇచ్చారు.


ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే. ఈ నేపథ్యంలోనే విశ్వంభ టీమ్‌ మెగా ఫాన్స్ కు ఈరోజు సాయంత్రం బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ అప్డేట్‌ను తాజాగా చిరంజీవి పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. అందులో చిరంజీవి మాట్లాడుతూ.. `చాలా మందికి విశ్వంభర ఎందుకు ఆల‌స్యం అవుతుంద‌నే డౌట్ ఉంది. ఈ జాప్యం చాలా స‌ముచితమ‌ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మీకు అద్భుతమైన విజువల్స్‌తో అత్యుత్తమంగా సినిమాను అందించాల‌న్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప్ర‌య‌త్న‌మే ఈ ఆల‌స్యానికి ప్ర‌ధాన కార‌ణం.


ఇక‌పోతే విశ్వంభ‌ర అందరూ ఆస్వాదించేలా ఒక చందమామ కథలా సాగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌ను, మ‌రీ ముఖ్యంగా పెద్ద‌వారిలో ఉండే చిన్న‌పిల్ల‌ల‌ను అల‌రించే విధంగా ఈ సినిమా ఉంటుంది. విశ్వంభ‌ర రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారి కోసం నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ రోజు సాయంత్రం 6.06 గంట‌ల‌కు యూవీ క్రియేష‌న్స్ వారు చిన్న గ్లింప్స్‌ విడుదల చేస్తున్నారు. అంత‌క‌న్నా ముందే రిలీజ్ డేట్ ను లీక్ చేస్తున్నా.. 2026 స‌మ్మ‌ర్ కానుక‌గా విశ్వంభ‌ర మీ ముందుంటుంది నాది భ‌రోసా. ఎంజాయ్‌` అని పేర్కొన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: