"దళపతి విజయ్"తో ఆ సినిమా గురించి డిస్కస్ చేశా.. మురుగదాస్..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో ఏ ఆర్ మురగదాస్ ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. ఆఖరుగా ఈయన సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సికిందర్ అనే హిందీ మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఆపజయాన్ని సొంతం చేసుకుంది.


తాజాగా మురగదాస్ , శివ కార్తికేయన్ హీరోగా మదరాసి అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ మరికొంత కాలం లోనే విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా మురగదాస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా తలపతి విజయ్ గురించి కొన్ని కామెంట్స్ చేస్తాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మురుగదాస్ మాట్లాడుతూ ... కొన్ని నెలల క్రితం నేను అనుకోకుండా తలపతి విజయ్ ని కలిసాను. ఆ సందర్భంలో ఆయనతో మనం తుపాకి 2 సినిమా చేద్దాం అని చెప్పాను. ఇదంతా జరిగింది ఆయన రాజకీయాల్లోకి రాకముందు.


తుపాకి 2 సినిమా చేస్తే విజయ్ తో మాత్రమే చేయగలను. వేరే హీరోతో చేయలేను అని మురగదాస్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. విజయ్ , మురగదాస్ కాంబోలో రూపొందిన తుపాకి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ , మురగదాస్ కాంబోలో మొదటగా తుపాకి సినిమా వచ్చింది. ఆ తర్వాత వేరే కాంబోలో కత్తి , సర్కార్ అనే సినిమాలు వచ్చాయి. వీరి కాంబో లో వచ్చిన మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: