తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ , సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు అయినటువంటి హరికృష్ణ కుమారుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు దేశం పార్టీ కోసం ఎంతో పెద్ద ఎత్తున క్యాంపెనింగ్ చేసిన వ్యక్తులలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కానీ ఆ తర్వాత క్రమ క్రమంగా ఈయన పార్టీకి దూరం అవుతూ , అలాగే నందమూరి కుటుంబానికి కూడా దూరం అవుతూ వస్తున్నాడు అని వార్తలు వచ్చాయి.
ఇకపోతే దాదాపు జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా రాజకీయాల గురించి కానీ , తెలుగుదేశం పార్టీ గురించి కానీ పెద్దగా వ్యాఖ్యానించడం లేదు. దానితో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలను గురించి అసలు పట్టించుకోవడం లేదు అనే వాదనను బలంగా వినిపిస్తూ వచ్చారు. తాజాగా టి డి పి ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.
తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక ప్రెస్ మీట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలి అని భావించారట. కానీ వారికి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదట. దానితో ఆంధ్ర ప్రదేశ్ లోని మరో ప్రాంతంలో ప్రెస్ మీట్ ను నిర్వహించడానికి ఆయన అభిమానులు ప్రయత్నించిన అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదట. దానితో ఆయన అభిమానులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తారక్ అభిమానులు తాజాగా మాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి కూడా అస్సలు పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పుకొచ్చిన ఆడియో ఒకటి వైరల్ అవుతుంది.