మీరెవరో నాకు తెలియదంటూ త్రివిక్రమ్ పరువు తీసిన అనుపమ.?

Pandrala Sravanthi
ఏంటి ఇండస్ట్రీలో స్టార్ దర్శకులలో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ అంటే అనుపమ పరమేశ్వరన్ కి తెలియదా..ఆయన డైరెక్షన్లోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమకి ఆయన ఎవరో తెలియదు అనడం నిజంగా వింతనే అంటున్నారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు.మరి ఎందుకు అనుపమ త్రివిక్రమ్ పరువు తీసేలా మాట్లాడింది.. ఆయన డైరెక్షన్ లోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి చివరికి ఆయనే తెలియదని ఎందుకు మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అనుపమ పరమేశ్వరన్ మలయాళ బ్యూటీ  అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి నితిన్ హీరోగా చేసిన అఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా అనుపమ సెకండ్ హీరోయిన్ గా నితిన్ అంటే ఇష్టపడే అమ్మాయి పాత్రలో కనిపించింది.


 అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అలా త్రివిక్రమ్ డైరెక్షన్లోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి చివరికి త్రివిక్రమే తెలియదంటుంది. అయితే అనుపమ ఈ మాటలు ఎందుకు మాట్లాడిందంటే.. మొదట తెలుగులో అఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్ వంశీ,అనుపమ దగ్గరికి వెళ్లి త్రివిక్రమ్ కాల్ చేశారు అని చెప్పారట. ఇక డైరెక్టర్ వంశీ మాటలకు త్రివిక్రమ్ అంటే ఎవరో తెలియని అనుపమ ఆయనెవరు.. నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్పిందట. ఆ తర్వాత త్రివిక్రమ్ ఎవరో తెలుసుకోవడానికి విక్కీపీడియాలో సెర్చ్ చేయగా..ఆయన ఎవరు... ఆయన సినిమాలు ఏంటి అనేది అనుపమకి తెలిసి వచ్చిందట.


 అలా మలయాళ బ్యూటీ అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ కి మొదట్లో త్రివిక్రమ్ తెలియదని చెప్పింది. అయితే తెలుగులోకి రాకముందు త్రివిక్రమ్ ఎవరో తెలియదని చెప్పినట్లు తాజాగా పరదా మూవీ ప్రమోషన్స్ లో బయట పెట్టింది.అయితే ఈ విషయాన్ని కొంతమంది నెగటివ్ చేస్తూ త్రివిక్రమ్ డైరెక్షన్లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ చివరికి త్రివిక్రమే తెలియదంటూ ఆయన పరువు తీసేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ త్రివిక్రమ్ అంటే ఎవరో తెలియక ముందు అనుపమ మాట్లాడిన మాటలు ఇవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: