సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ గేయ రచయిత గా..కవిగా.. ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిన వైరముత్తు అంటే తెలియని వారు ఉండరు.ఈయన ముఖ్యంగా సింగర్ చిన్మయి చేసిన కాంట్రవర్సీ కామెంట్ల ద్వారా ఇండస్ట్రీలో మరింత ఫేమస్ అయ్యారు. ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కునే వైరముత్తు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈయన మాట్లాడిన మాటలు హిందువులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడారయ్యా అంటే.. శ్రీరాముడికి మతిస్థిమితం లేదని..అయితే ఈ మాటలు వింటేనే రాముడి భక్తులు ఆయన్ని రోడ్లమీద కనిపిస్తే కొడతాం అనేంత కోపంగా ఉంటారు. మరి ఇంతకీ ఆయన ఈ మాటలు ఎందుకు మాట్లారయ్యా అంటే.. తాజాగా తమిళ కవి కాంబర్ పేరుతో అవార్డు అందుకున్న వైరముత్తు ఆ ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంబ రామాయణం ప్రకారం శ్రీరాముడికి మతిస్థిమితం లేదు.ఆయన సీతను కోల్పోయాక మానసిక సమతుల్యత కోల్పోయాడు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే వైరముత్తు ఈ మాటలు ఎందుకు మాట్లాడాలరంటే తమిళ కవి కాంబ రచించిన కాంబ రామాయణంలో వాలికి శ్రీరాముడికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అందులో వాలి మీరు తమ్ముడి కోసం రాజ్యాన్నే వదిలేస్తారు. కానీ అడవిలోకి వచ్చాక మాత్రం వాలి రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగిస్తారు.సీతను కోల్పోయాక మీ మానసిక స్థిరత్వాన్ని కూడా కోల్పోయారు అంటూ మాట్లాడుతారు. అయితే వాలి శ్రీరాముడు మాట్లాడుకున్న ఈ సంభాషణను ఆధారంగా చేసుకొని కాంబర్ సాహిత్యపు రచనలు ఎలా ఉంటాయో ఆ విశిష్టతను ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో వైరముత్తు చెప్పారు. అయితే కాంబ రామాయణంలో రచించినప్పుడు చట్టాలు వంటివి ఏమీ లేవు.
అయితే మతిస్థిమితం లేని వాళ్ళు చెప్పే మాటల్ని పరిగణలోకి తీసుకోరు. ఐపిసి 84 సెక్షన్ ప్రకారం మతిస్థిమితం లేని వాళ్లకు శిక్షల కూడా ఏమీ ఉండవు. అయితే కాంబర్ కాలంలో ఇలాంటి చట్టాలు లేకపోయినప్పటికీ మానవ స్వభావం ఎలా ఉంటుంది న్యాయపరమైన తర్కం వంటివి ఆయనకు బాగా తెలుసు. అందుకే కాంబ రామాయణంలో ఈ విధంగా రాశారు అంటూ కవిని మెచ్చుకుంటూ వైరముత్తు మాట్లాడారు.కానీ వైరముత్తు చేసిన వ్యాఖ్యలపై హిందువులు ఆగ్రహిస్తున్నారు. దాంతో వైరముత్తుపై దేశవ్యాప్తంగా హిందువులు మండిపడుతున్నారు.