"డోంట్ వర్రి మీకు నేనున్నాను"..నిర్మాతలకి మెగా "స్టార్" హామీ..!
ప్రస్తుతం కార్మికుల వేతనాలు అంశం చర్చినీయాంశంగా మారింది . నిర్మాతలు వేతనాలు పెంచకపోవడం.. ఎంప్లాయిస్ ఫెడరేషన్ రద్దు చేయడంతో కార్మికులు బంద్ ప్రకటించారు . దీంతో ఎక్కడ షూటింగ్ అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొందరు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ బాధను విన్నవించుకున్నారు . సెట్స్ పై ఉన్న సినిమాలు ఆగిపోతే ఎంత నష్టం వస్తుంది అనేది వివరించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు ,అల్లు అరవింద్, సుప్రియ ,మైత్రి రవి చేరుకున్నారు .
సినీ కార్మికులు చేస్తున్న బంద్ విషయంపై నిర్మాతలు చర్చించినట్లు సమాచారం . కార్మికుల వేతనాల పెంపు వివాదం .. యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్ తీసుకుని నిర్ణయాలు చిరంజీవికి వివరించారు . తాను ఇండస్ట్రీ పెద్ద కాదు అని చెబుతూనే చిరంజీవి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . రెండు రోజులు చూసి ఆ తర్వాత పరిస్థితి గురించి ఫైనల్ డెసీషన్ తీసుకుంటాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారట. ఆ తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకోకపోతే రెండు రోజుల తర్వాత నేను రంగంలోకి దిగుతాను అని నిర్మాతలకు హామీ ఇచ్చారట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మరోసారీ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి మెగాస్టార్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి మంచి రోజులు తెచ్చిపెడుతుందో...???