ఆ విషయంలో కూలీ సినిమా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.. శృతి హాసన్..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా సినీ కేరిర్ ను మొదలు పెట్టింది. కానీ ఈమెకు కెరియర్ ప్రారంభంలో విజయాలు దక్కలేదు. ఈమెకు మొదటి విజయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ ద్వారా వచ్చింది. ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన విజయం దక్కడం  మాత్రమే కాకుండా సూపర్ సాలిడ్ క్రేజ్ కూడా వచ్చింది. దానితో ఈమెకు వరసగా తెలుగులో భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు రావడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగు లో తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.


ఇకపోతే ఈమె ప్రస్తుతం కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. రాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఆమీర్ ఖాన్ క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో అనేక మంది అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీ నటులు నటించారు.


తాజాగా కూలీ సినిమా గురించి అందులో నటించడం గురించి శృతి హాసన్ కొన్ని కామెంట్స్ చేసింది. తాజాగా శృతి హాసన్ మాట్లాడుతూ  ... కూలీ మూవీ లో ఉన్న అందరూ నటీ నటులతో నాకు కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇంత పెద్ద భారీ తారాగణంతో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని శృతి హాసన్ తాజాగా వెల్లడించింది. ఇకపోతే ప్రస్తుతానికి కూలీ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: