కుర్ర హీరోయిన్ తో శేఖర్ కమ్ముల ఎఫైర్.. ఇన్ని రోజులు గుట్టుగా ఉంచి.?
అలాంటి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో హ్యాపీడేస్,ఆనంద్,ఫిదా, కుబేర, లీడర్, లవ్ స్టోరీ,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,గోదావరి వంటి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పటివరకు ఈయన తీసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హిట్స్ గానే నిలిచాయి. అయితే అలా అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల మీద ఒక రూమర్ కూడా ఉంది. అదేంటంటే శేఖర్ కమ్ముల ఓ కుర్ర హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని,అందుకే ఆ కుర్ర హీరోయిన్ ని తన సినిమాలో ఎక్కువగా రిపీట్ చేస్తారు అనే టాక్ ఉంది. అయితే ఈ విషయం గురించి మరింత క్లారిటీగా అడిగారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఆర్కే రాధాకృష్ణ.. మీరు ఒక యంగ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారని, ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .
ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ శేఖర్ కమ్ములను అడగగా.. అదంతా రూమర్ మాత్రమే..ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ కొట్టి పారేశారు. ఇక ఆ హీరోయిన్ ఎవరంటే కమలిని ముఖర్జీ. అయితే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన గోదావరి,ఆనంద్ వంటి రెండు సినిమాల్లో వరుసగా కమలిని ముఖర్జీని తీసుకున్నారు. అలాగే హ్యాపీడేస్ లో కూడా ఓ స్పెషల్ పాత్ర కోసం కమలిని ముఖర్జీని హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో చాలామంది అప్పటి జనాలు శేఖర్ కమ్ములకి కమలిని ముఖర్జీతో ఎఫైర్ ఉందని, అందుకే తన సినిమాల్లో వరుసగా ఆమెనే తీసుకుంటున్నారనే ఆరోపణలు చేశారు.